TG: మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గురువారం ఏపీకి వెళ్లనున్నారు. ఈ నెల 8,9న తెలంగాణలో జరిగే రైజింగ్ సమ్మిట్‌కు ఏపీ సీఎం చంద్రబాబును ఆహ్వానించనున్నారు. అయితే ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కోనసీమ దిష్టి వ్యాఖ్యల నేపథ్యంలో కోమటిరెడ్డి పవన్‌ను కలుస్తారా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది. మంత్రి కోమటిరెడ్డి కూడా పవన్ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేసిన విషయం తెలిసిందే.