TG: కృష్ణా జలాలను విడుదల చేయాలని తెలంగాణ మంత్రులు వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, ఎమ్మెల్యేలు బండ్ల కృష్ణమోహన్‌రెడ్డి, మేఘారెడ్డి, మధుసూదన్‌రెడ్డి కర్ణాటక సీఎం డీకే శివకుమార్‌ను కోరారు. బెంగళూరులో ఆయనను కలిసి జూరాల, భీమా, నెట్టెంపాడు, కోయిల్‌సాగర్ పరిధిలోని పంటలను కాపాడేందుకు నెల రోజుల పాటు రోజుకు 5 వేల క్యూసెక్కుల నీటిని విడుదల చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ నాలుగు ప్రాజెక్టుల కింద 5.5 లక్షల ఎకరాల ఆయకట్టు ఉందని వివరించారు. కాగా, రైతులను ఆదుకునేందుకు చర్యలు తీసుకుంటామని శివకుమార్ హామీ ఇచ్చినట్లు సమాచారం.