తెలంగాణ పోలీస్ డ్యూటీ మీట్-2025 వరంగల్‌లోని మామునూరులో గురువారం ప్రారంభమైంది. పోలీస్ అకాడమీ డైరెక్టర్ అభిలాష్ భిష్ట, అడిషనల్ డీజీపీ మహేష్ భగవత్ డ్యూటీ మీట్‌ను ప్రారంభించారు. మూడు రోజులపాటు సాగనున్న ఈ పోటీల్లో ఉమ్మడి పది జిల్లాల్లోని వివిధ విభాగాలకు చెందిన 1000 మంది పోలీస్ అధికారులు, సిబ్బంది పాల్గొననున్నారు. మొత్తం 25 విభాగాల్లో పోటీలు జరగనుండగా.. ఆగస్టు 2న విజేతలకు బహుమతులు అందజేస్తారు.