తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ డిసెంబర్ 8, 9 తేదీల్లో జరగనుంది. ఈ సమ్మిట్‌కు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులను ఆహ్వానించాలని తెలంగాణ ప్రభుత్వం నిర్ణయించింది. సీఎం రేవంత్‌రెడ్డి సూచన మేరకు పలువురు మంత్రులు గురువారం వివిధ రాష్ట్రాలకు వెళ్లి సీఎంలను ఆహ్వానించనున్నారు. రాష్ట్ర ఎంపీల బృందం దిల్లీ సీఎం, కేంద్రమంత్రులు, గవర్నర్లను ఆహ్వానించనుంది.