తెలంగాణలో సినిమా పరిశ్రమ అభివృద్ధికి ‘తెలంగాణ 2047 విజన్ డాక్యుమెంట్’లో ప్రత్యేక అధ్యాయం రూపొందిస్తున్నామని సీఎం రేవంత్ తెలిపారు. హాలీవుడ్ స్థాయి చిత్రాలకూ తెలంగాణ కేంద్రంగా మారాడమే ప్రభుత్వ లక్ష్యం అని చెప్పారు. సాగర్ పిక్చర్స్ నిర్మించే “శ్రీమద్ భాగవతం” పార్ట్-1 ముహూర్త కార్యక్రమానికి ఆయన క్లాప్ కొట్టి ప్రారంభించారు. సినీరంగానికి తెలంగాణలో గ్లోబల్ గుర్తింపు తీసుకురావడానికి కృషి చేస్తోందన్నారు.