నీటి విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదు: హరీశ్‌రావు

TG: నీళ్ల కోసం పోరాటాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామని, నీళ్ల విషయంలో అన్యాయం జరిగితే తెలంగాణ ఊరుకోదని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీశ్ రావు హెచ్చరించారు. బుధవారం తెలంగాణ భవన్‌లో ఆయన మీడియాతో మాట్లాడారు. ఏపీ సీఎం చంద్రబాబు తెలంగాణ ప్రజల నోటికాడి బుక్కను లాక్కోవాలని చూస్తున్నాడని ఫైర్ అయ్యారు. GRMB అజెండాలో TGకి ఇచ్చిన అనుమతులను రద్దు చేయాలని AP ప్రభుత్వం ప్రతిపాదించిందని హరీశ్‌రావు ఆరోపించారు. తెలంగాణ ప్రాజెక్టులు ఆపాలని కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాశారని ఫైర్ అయ్యారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్