టెలిగ్రామ్ CEOకి 12 దేశాల్లో 100 మంది పిల్లలు

టెలిగ్రామ్ సీఈవో పావెల్ దురోవ్ వయసు 39 ఏళ్లు. కోటేశ్వరుడైనా ఇప్పటికీ పెళ్లి చేసుకోలేదు. కానీ 12 దేశాల్లోని 100 మందికిపైగా సంతానాన్ని పొందారు. ఇంతకీ ఎలా అనేది ఆయనే స్వయంగా వెల్లడించారు. ఇతరులకు వీర్యదానం చేయడం ద్వారా అంతమంది పిల్లలకు తాను తండ్రిని అయ్యానని పావెల్ తెలిపారు. 'పిల్లలు లేకపోవడంతో స్నేహితుని కోరిక మేరకు వీర్య దానం చేశానని, ఆ సంఘటనతో సంతానలేమి సమస్య ఎంత తీవ్రంగా ఉందో నాకు మరింత అర్థమైంది' అని పావెల్ పేర్కొన్నారు.

సంబంధిత పోస్ట్