తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికల్లో తెలుగు మహిళ ఎమ్మెల్యేగా గెలిచి చరిత్ర సృష్టించారు. TVK పార్టీ తరఫున శివకాశి అసెంబ్లీ నియోజకవర్గం నుంచి బరిలో నిలిచిన S.కీర్తన తన సమీప ప్రత్యర్థిపై 57,039 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. దీంతో 1957 నుంచి ఇప్పటిదాకా అక్కడ ఎన్నికైన తొలి మహిళా ఎమ్మెల్యేగా కీర్తన నిలిచారు. ఇదిలా ఉండగా కీర్తన తెలుగులో స్పష్టంగా మాట్లాడి అందరిని ఆశ్చర్యానికి గురి చేసింది. మార్పు కోసం ప్రజలు ఓటు వేశారని ఆమె చెప్పుకొచ్చారు.