యూట్యూబ్‌లో ఫ్రీగా తెలుగు హారర్‌ కామెడీ చిత్రం

సాధారణంగా సినిమాలు థియేటర్లలో విడుదలైన తర్వాత ఓటీటీలోకి వస్తాయి. కానీ ‘చెట్టు మీద దెయ్యం నాకేం భయం’ అనే తెలుగు హారర్ కామెడీ చిత్రం జూన్ 26న థియేటర్లలో విడుదలైనప్పటికీ, ప్రస్తుతం టాలీవుడ్ టైమ్స్ యూట్యూబ్ ఛానెల్‌లో ఉచితంగా స్ట్రీమింగ్ అవుతోంది. దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడుతూ, ప్రేక్షకుల మద్దతుకు కృతజ్ఞతగా ఈ నిర్ణయం తీసుకున్నామని, థియేటర్ అనుభూతిని పొందనివారు లేదా మళ్లీ చూడాలనుకునేవారు యూట్యూబ్‌లో ఉచితంగా చూసి ఆనందించవచ్చని తెలిపారు.

సంబంధిత పోస్ట్