సెన్సార్‌ బోర్డ్‌ కొత్త ప్యానెల్‌లో తెలుగు నిర్మాత సుప్రియ

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ ఫిల్మ్‌ సర్టిఫికేషన్‌ (సెన్సార్‌ బోర్డ్‌) ప్యానెల్‌లో కేంద్ర ప్రభుత్వం మార్పులు చేసింది. కొత్త ప్యానెల్‌లో ప్రముఖ నటులు ప్రీతి జింటా, సునీల్ శెట్టి, పంకజ్ త్రిపాఠి, రూపాలీ గంగూలీలకు చోటు కల్పించింది. వీరితో పాటు ప్రసన్‌జీత్‌ ఛటర్జీ, మనోజ్ జోషి, పల్లవి జోషి, వినోద్ అనుపమ్, అభిషేక్ జైన్, ప్రియదర్శన్, హన్స్ రాజ్ హన్స్, సుప్రియ యార్లగడ్డ (తెలుగు నిర్మాత), యతీంద్ర మిశ్రా, నీల మాదబ్ పాండా, నిశిగంధ, వామన్ కేంద్రె, రమేష్ పతంగే, గ్రామీ అవార్డు విజేత రికీ కేజ్‌ ఉన్నారు. ఈ కమిటీ మూడేళ్ల కాలానికి లేదా తదుపరి ఆదేశాలు వెలువడే వరకు విధులు నిర్వర్తిస్తుంది.

సంబంధిత పోస్ట్

✕
✕