ఏప్రిల్, మేలో విస్తారంగా కురిసిన వర్షాలు ఎండాకాలాన్ని మరిపించాయి. కానీ తొలకరి వానల తర్వాత వరుణుడు మాయమయ్యాడు. దీంతో తెలుగు రాష్ట్రాల్లో దుక్కి దున్నిన రైతన్నలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. ఏ రోజు వాన పడుతుందా అని ఆశగా చూస్తున్నారు. వరుణుడు కనికరించాలని మొక్కులు చెల్లిస్తున్నారు. కొన్ని గ్రామాల్లో కప్పల పెళ్లిళ్లు కూడా జరుపుతున్నారు.