60 ఏళ్లుగా ఆగని రామనామం.. గిన్నీస్ రికార్డుకెక్కిన ఆలయం

గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో ఉన్న బాలా హనుమాన్ ఆలయంలో 1964 ఆగస్టు 1 నుంచి నిరంతరాయంగా రామనామ స్మరణ కొనసాగుతోంది. ‘శ్రీరామ్.. జై రామ్.. జై జై రామ్’ అంటూ భక్తులు పగలు, రాత్రి తేడా లేకుండా 24 గంటలూ జపిస్తున్నారు. ప్రేమ్‌ భిక్షుజీ మహరాజ్‌ ప్రారంభించిన ఈ సంప్రదాయాన్ని తరాలుగా భక్తులు కొనసాగిస్తున్నారు. ఈ నిరంతర రామధున్‌కు గుర్తింపుగా ఆలయానికి గిన్నిస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌లో చోటు లభించింది. రణ్మల్‌ సరస్సు (లఖోటా సరస్సు) సమీపంలో ఈ ఆలయం ఉంది. ఇలాంటి ఆలయ విశేషాలను ప్రతిరోజూ సాయంత్రం 5 గంటలకు #Hidden Secrets of Telugu Temples ద్వారా తెలుసుకోవచ్చు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕