మే మొదటి వారంలో పది ఫలితాలు!

తెలంగాణలో పదో తరగతి పరీక్షలు ఏప్రిల్ 16న ముగిశాయి. ఇప్పటికే మూల్యాంకనం, స్కానింగ్ పూర్తయ్యాయి. దీంతో మే మొదటి వారంలో, ముఖ్యంగా మే 4 లేదా 5 తేదీల్లో ఫలితాలు విడుదల చేసేందుకు విద్యాశాఖ కసరత్తు చేస్తోంది. రాష్ట్రవ్యాప్తంగా 5,28,239 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఈసారి ఫలితాలను అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్ ద్వారా కూడా తెలుసుకునే సదుపాయం కల్పించారు. 80969 58096 నంబర్‌కు 'Hi' అని మెసేజ్ చేసి, SSC రిజల్ట్స్‌ అని టైప్‌చేసి హాల్‌టికెట్‌ నంబర్‌, ఇతర వివరాలు నమోదు చేయాలి. ఆ వెంటనే రిజల్ట్స్ స్క్రీన్‌పై కనిపిస్తాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్