తెలంగాణలో పదో తరగతి ఫలితాల విడుదలపై ఉత్కంఠ నెలకొంది. ఈ నెల 29 లేదా 30 తేదీల్లో ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని సమాచారం. ప్రభుత్వ సలహాదారు కె. కేశవరావు చేతుల మీదుగా ఫలితాలు విడుదలయ్యే అవకాశముందని తెలుస్తోంది. మార్చి 14 నుంచి ఏప్రిల్ 13 వరకు జరిగిన ఈ పరీక్షలకు సుమారు 5.15 లక్షల మంది విద్యార్థులు హాజరయ్యారు. ఇప్పటికే జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తవడంతో ఫలితాల ప్రకటనకు అధికారులు సిద్ధమయ్యారు.