విషాదం.. అమెరికాలో తెనాలి యువతి దుర్మరణం

AP: అమెరికాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గుంటూరు జిల్లా తెనాలి యువతి మృతి చెందారు. తెనాలికి చెందిన వ్యాపారి గణేశ్, రమాదేవి దంపతుల కుమార్తె నాగశ్రీవందన పరిమళ (26) 2022లో ఎంఎస్ చదవడానికి అమెరికా వెళ్లారు. టెన్నెసీ రాష్ట్రంలో చదువుతున్నారు. అయితే ఆమె ప్రయాణిస్తున్న కారును ట్రక్ ఢీకొట్టడంతో గాయాలై దుర్మరణం చెందారు. పరిమళ మృతదేహాన్ని తెనాలికి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి. కూతురి మరణవార్త విని తల్లిదండ్రులు కన్నీరుమున్నీరవుతున్నారు.

సంబంధిత పోస్ట్