TG: హైదరాబాద్లోని బోయిన్పల్లి పోలీస్ స్టేషన్ వద్ద తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ KTRతో పాటు పార్టీ నేతలను అరెస్ట్ చేసి బోయిన్పల్లి PSకు తీసుకెళ్లారు. దీంతో వరి అరెస్టుకు నిరసనగా పీఎస్ వద్ద బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు ఆందోళనలకు దిగారు. ఈ క్రమంలో కాంగ్రెస్, BRS కార్యకర్తల మధ్య ఘర్షణ చోటు చేసుకుంది. రాళ్లు, కర్రలు, చెప్పులతో పరస్పరం దాడి చేసుకున్నారు. పోలీసులు ఇరువర్గాలను చెదరగొట్టారు.