ఎన్నికల కమిషనర్ల అభ్యంతరాల నేపథ్యంలో సీఈసీ జ్ఞానేశ్ కుమార్‌కు వ్యతిరేకంగా ప్రతిపక్ష ఇండియా కూటమి నేతలు జంతర్‌మంతర్ వద్ద నిరసనలు చేపట్టారు. 'సేవ్ డెమోక్రసీ' పేరుతో నిర్వహిస్తున్న ఈ నిరసనలకు దిల్లీ పోలీసులు అనుమతి నిరాకరించారు. నిరసన ప్రదేశానికి చేరుకున్న ఆప్ నేత సౌరభ్ భరద్వాజ్ సహా పలువురు ఆప్, యూత్ కాంగ్రెస్ కార్యకర్తలను పోలీసులు నిర్బంధించారు. అడ్డుకున్న కార్యకర్తలపై పోలీసులు లాఠీఛార్జీ చేయడంతో జంతర్‌మంతర్‌ను మూసివేశారు.