జగిత్యాలలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఇంటి వద్ద బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెళ్తున్న సమయంలో తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. కేటీఆర్ వెంట గంగుల కమలాకర్, కొప్పుల ఈశ్వర్ తదితరులు ఉన్నారు. కార్యకర్తలు దూసుకురావడంతో తోపులాట జరిగింది. ఈ క్రమంలో మీడియా ప్రతినిధులపై కార్యకర్తలు పడిపోవడంతో పలువురు జర్నలిస్టులకు గాయాలయ్యాయి. ఎలక్ట్రానిక్ మీడియా కెమెరాలు ధ్వంసమయ్యాయి. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీడియా ప్రతినిధులు కార్యక్రమాన్ని బహిష్కరించారు.