బంగ్లాదేశ్‌లో ఉద్రిక్తత.. బస్సుకు నిప్పంటించిన దుండగులు

బంగ్లాదేశ్‌లో మరోసారి ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ దేశ రాజధాని ఢాకాలో వరుస అల్లర్లు చోటుచేసుకున్నాయి. గుర్తుతెలియని దుండగులు మెట్రో స్టేషన్ కింద ఉన్న లబ్బైక్ పరిబహన్ బస్సుకు నిప్పు పెట్టారు. అలాగే, సౌత్ ఈస్ట్ యూనివర్సిటీ ఎదుట రెండు నాటు బాంబులు పేలడంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. కాక్టెయిల్ బాంబుల పేలుళ్లతో ఆ ప్రాంతమంతా ఒక్కసారిగా కలకలం రేగింది. ఈ వరుస ఘటనలతో అప్రమత్తమైన భద్రతా బలగాలు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నాయి.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్

✕
✕