నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో ఉద్రిక్తత

నిజామాబాద్ పసుపు మార్కెట్ యార్డులో ఉద్రిక్తత చోటుచేసుకుంది. సెక్యూరిటీ అధికారి శ్రీనివాస్‌పై కార్మికులు దాడికి పాల్పడ్డారు. మార్కెట్ యార్డులో కార్మికులు సమ్మెకు దిగారు. అనంతరం ఛైర్మన్ కార్యాలయం ముట్టడికి యత్నించారు. తమపై పసుపు దొంగతనం ఆరోపణలు చేస్తున్నారని కార్మికులు ఆగ్రహం చేశారు. పసుపు క్రయవిక్రయాలు నిలిచిపోవడంతో మరోవైపు రైతులు సైతం ఆందోళనకు దిగారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డు అంతటా ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

సంబంధిత పోస్ట్