కుప్పం కౌంటింగ్‌ కేంద్రం దగ్గర ఉద్రిక్తత (వీడియో)

AP: చిత్తూరు జిల్లా కుప్పం మున్సిపల్ కౌంటింగ్ కేంద్రం వద్ద తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. 3, 7, 8 వార్డుల్లో ఆధిక్యంలో ఉన్న తమను, తమ కౌంటింగ్ ఏజెంట్లను అధికారులు బలవంతంగా బయటకు పంపించారని వైసీపీ అభ్యర్థులు ఆరోపించారు. టీడీపీ అభ్యర్థులను గెలిపించేందుకే అధికారులు పక్షపాతంగా వ్యవహరిస్తున్నారని, గెలిచే స్థానాల్లో ఫలితాలను తారుమారు చేస్తున్నారని వారు ఆందోళన చేపట్టారు. దీంతో అభ్యర్థులు, ఏజెంట్లను పోలీసులు చెదరగొట్టారు. టీడీపీ, వైసీపీ నేతల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.

సంబంధిత పోస్ట్

✕
✕