లద్దాఖ్‌లో జరిగిన హింసాత్మక ఘటనలకు కారణమంటూ పర్యావరణవేత్త సోనమ్ వాంగ్‌చుక్‌ను పోలీసులు అరెస్టు చేశారు. లద్దాఖ్‌కు రాష్ట్ర హోదా ఇవ్వాలని కోరుతూ వాంగ్‌చుక్ చేసిన ప్రకటనల కారణంగానే రెండు రోజుల క్రితం లేహ్‌లో ఉద్రిక్తతలు చెలరేగాయని కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ హింసలో నలుగురు మరణించారు, 90 మందికి పైగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలోనే వాంగ్‌చుక్‌ను అరెస్టు చేశారు.