మిడిల్ ఈస్ట్‌లో ఉద్రిక్తతలు పెరుగుతున్న నేపథ్యంలో, తమ దేశంపై అమెరికా సైనిక చర్య తీసుకుంటే మిడిల్ ఈస్ట్‌లోని అమెరికా సైనిక స్థావరాలపై దాడులు చేస్తామని ఇరాన్ హెచ్చరించింది. ఈ నేపథ్యంలో, ఖతార్‌లోని అల్ ఉదీద్ ఎయిర్ బేస్ నుండి అమెరికా తన సైనిక బలగాలను వెనక్కి పిలిపించింది. ముందు జాగ్రత్త చర్యగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా పేర్కొంది. మిడిల్ ఈస్ట్‌లో అమెరికాకు ఇదే అతిపెద్ద సైనిక స్థావరం, ఇక్కడ 10,000 మందికి పైగా అమెరికా సైనికులు ఉంటారు.