ప్రపంచ వాణిజ్యానికి కీలకమైన హర్మూజ్ జలసంధిలో సోమవారం ఒక ఎల్పీజీ ట్యాంకర్‌పై గుర్తుతెలియని వస్తువులతో దాడి జరిగింది. ఈ ఘటనలో ట్యాంకర్‌కు స్వల్ప నష్టం వాటిల్లినా, సిబ్బందికి ఎలాంటి ప్రాణహాని లేదా పర్యావరణానికి నష్టం జరగలేదని యునైటెడ్ కింగ్డమ్ మారిటైమ్ ట్రేడ్ ఆపరేషన్స్ (యూకేఎంటీవో) వెల్లడించింది. అదేరోజు మరో ట్యాంకర్‌పై జరిగిన దాడిలో ఇద్దరు సిబ్బందికి స్వల్ప గాయాలయ్యాయి. వరుస దాడుల నేపథ్యంలో ఈ మార్గంలో ప్రయాణించే నౌకలు అప్రమత్తంగా ఉండాలని యూకేఎంటీవో సూచించింది.