ఫలితాలకు ముందే.. ట్రాక్టర్ కిందపడి టెన్త్ విద్యార్థి మృతి

నల్గొండ జిల్లా నకిరేకల్ మండలంలోని మర్రూర్ గ్రామంలో పదో తరగతి ఫలితాలు వెలువడటానికి కొద్ది గంటల ముందు, మన్నెం జశ్వంత్ (15) అనే విద్యార్థి ట్రాక్టర్ కిందపడి మృతి చెందాడు. పదో తరగతి పరీక్షలు రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న జశ్వంత్, ఇంటిముందు ఉన్న ట్రాక్టర్‌ను స్టార్ట్ చేయడానికి ప్రయత్నించాడు. ట్రాక్టర్ గేరులో ఉందని తెలియక, ఇంజిన్ సెల్ఫ్ మోటార్ బ్యాటరీ కనెక్షన్‌ను సరిచేయడానికి ప్రయత్నించగా, ట్రాక్టర్ ఒక్కసారిగా స్టార్ట్ అయి అతనిపైకి దూసుకెళ్లింది. ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అదే రోజు విడుదలైన పదో తరగతి ఫలితాల్లో జశ్వంత్ 470 మార్కులు సాధించాడు.

సంబంధిత పోస్ట్