పాకిస్థాన్‌కు వెళ్లాలనుకునే ప్రయాణికులకు అమెరికా ప్రభుత్వం హెచ్చరిక!

పాకిస్థాన్‌లో పెరుగుతున్న ఉగ్రవాద దాడుల నేపథ్యంలో అమెరికా తన పౌరులకు ప్రయాణ ఆంక్షలు విధించింది. అత్యధిక ఉగ్రవాద ముప్పు ఉన్న 'లెవెల్ 3' విభాగంలో పాకిస్థాన్‌ను చేర్చింది. ఎలాంటి హెచ్చరికలు లేకుండా దాడులు జరిగే అవకాశం ఉందని, రవాణా కేంద్రాలు, హోటళ్లు, మార్కెట్లు, సైనిక స్థావరాలు వంటివి లక్ష్యాలు కావచ్చని అమెరికా విదేశాంగ శాఖ తెలిపింది. బలూచిస్థాన్, ఖైబర్‌పఖ్తుంఖ్వా వంటి ప్రాంతాలను అత్యంత ప్రమాదకరమైన 'లెవెల్-4'లో చేర్చి, అక్కడికి ప్రయాణించవద్దని హెచ్చరించింది. ప్రభుత్వ అధికారులను, ప్రైవేట్ పౌరులను ఆ ప్రాంతాలకు వెళ్లవద్దని, హత్యలు, కిడ్నాప్‌లు సర్వసాధారణమని పేర్కొంది.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్