జులై 3న ప్రారంభం కానున్న అమర్నాథ్ యాత్రకు ఉగ్రవాద ముప్పు పొంచి ఉందని నిఘా వర్గాలు హెచ్చరించాయి. పాకిస్థాన్‌లో అంతర్గత కల్లోల పరిస్థితులు నెలకొనడంతో, అక్కడి ప్రజల దృష్టిని మరల్చేందుకు ISI భారత్‌లో అలజడి సృష్టించే అవకాశం ఉందని, అందుకే యాత్ర మార్గమంతా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలో, యాత్రకు హాజరయ్యే భక్తుల భద్రతకు అత్యంత ప్రాధాన్యతనిస్తూ, అన్ని చర్యలు తీసుకుంటున్నారు.