TG: హైదరాబాద్ ఉగ్రవాది అహ్మద్ మోహియుద్దీన్ సయ్యద్‌పై దాడి జరిగింది. సబర్మతీ జైలులో అతడిపై ముగ్గురు తోటి ఖైదీలు దాడి చేశారు. ఈ ఘటనలో మోహియుద్దీన్ తీవ్రంగా గాయపడ్డాడు. కళ్ళు, ముక్కుపై కొట్టడంతో గాయాలయ్యాయి. దాడి చేసిన వారిలో నిలేష్ శర్మ అనే ఖైదీ ముఖ్యుడిగా గుర్తించారు. వెంటనే అతన్ని అహ్మదాబాద్ సివిల్ ఆసుపత్రికి తరలించారు. దేశవ్యాప్తంగా రిసిన్ అనే రసాయనంతో లక్షల మంది ప్రాణాలు తీసేందుకు మోమియుద్దీన్ కుట్ర చేసినట్లు అధికారులు గుర్తించారు.