ఎలాన్ మస్క్‌కు చెందిన టెస్లా భారత్‌లోకి అడుగుపెట్టింది. ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్‌లో మంగళవారం తొలి షోరూంను ప్రారంభించింది. మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ ఈ షోరూమ్ ప్రారంభోత్సవానికి హాజరై మాట్లాడారు. దేశంలో ఎలక్ట్రిక్ వాహనాల తయారీ, అభివృద్ధి కోసం టెస్లా భవిష్యత్తు ప్రణాళికలపై ఆశాభావం వ్యక్తం చేశారు. టెస్లా భారత్‌లోనూ తయారీ ప్లాంట్, రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ యూనిట్‌ను ఏర్పాటు చేయాలని ఆశిస్తున్నట్లు చెప్పారు.