తెలంగాణలో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. సిద్దిపేట జిల్లా అక్కన్నపేట మండలం గోవర్ధనగిరిలో ఉపాధి హామీ పనుల్లో ప్రమాదం చోటు చేసుకుంది. ప్రమాదవశాత్తు బండరాళ్లు మీద పడి తల్లి, కూతురు మృతి చెందారు. ఈ ప్రమాదంలో మరో ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.