TG: త్వరలో ఆటోల్లోనూ కామన్‌పాస్ సేవలు!

TG: ఆర్టీసీ-మెట్రో రైలు కామన్‌ పాస్‌ ప్రయాణికులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు.  ఒకే పాస్‌తో మెట్రో, ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవచ్చని తెలిపారు. హైదరాబాద్‌లో త్వరలో ఆటోల్లోనూ కామన్‌పాస్ సేవలు విస్తరిస్తామని చెప్పారు. ఇటీవల ప్రవేశపెట్టిన ‘1 డే కామన్‌ పాస్‌’ అమలు తీరును పరిశీలించేందుకు భట్టి విక్రమార్కతోపాటు మంత్రులు పొన్నం ప్రభాకర్‌, వివేక్‌ వెంకటస్వామి బేగంపేట నుంచి జూబ్లీహిల్స్‌ చెక్‌పోస్టు వరకు మెట్రోలో, అనంతరం జూబ్లీహిల్స్‌ నుంచి సచివాలయం వరకు ఆర్టీసీ బస్సులో ప్రయాణించారు.

సంబంధిత పోస్ట్

✕
✕