తెలంగాణలో రానున్న మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. బంగాళాఖాతంలో ఏర్పడిన అర్నబ్ తుఫాను ప్రభావంతో మంగళవారం నుంచి వాతావరణంలో మార్పులు ఉంటాయని పేర్కొంది. మంగళవారం ఉమ్మడి వరంగల్, ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో వర్షాలు కురిసే అవకాశం ఉంది. బుధవారం ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, మహబూబాబాద్ జిల్లాల్లో అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు.