TG: నిమజ్జనంలో డ్యాన్స్.. గుండెపోటుతో కుప్పకూలాడు(వీడియో)

TG: నారాయణపేట్ జిల్లా కేంద్రంలో వినాయక నిమజ్జన ఉత్సవాల్లో అపశృతి చోటు చేసుకుంది. నారాయణపేట మున్సిపాలిటీలో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా పనిచేస్తున్న శేఖర్(45) డీజే ముందు డ్యాన్స్ చేస్తూ ఒక్కసారిగా గుండెపోటుతో కుప్పకూలాడు. స్పందించిన ఎస్సై, స్థానికులు సీపీఆర్ చేసినా ఫలితం లేకపోయింది. మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం నారాయణపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

సంబంధిత పోస్ట్