ఆదిలాబాద్ (D) నార్నూర్ (M) మాలేపూర్ ఘాట్‌లో ఆదివారం యాత్రికులు ప్రయాణిస్తున్న వాహనం బోల్తాపడింది. ఈ ప్రమాదంలో 47 మంది యాత్రికులకు గాయాలయ్యాయి. క్షతగాత్రులను రిమ్స్, నార్నూర్, ఉట్నూర్ ఆసుపత్రులకు తరలించారు. కెరమెరి (M) జంగుబాయి ఆలయానికి భక్తులు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో వాహనంలో మొత్తం 60 మంది భక్తులు ఉన్నారు. వీరిని గుడిహత్నూర్(M) సూర్యగూడ గ్రామ ఆదివాసీలుగా గుర్తించారు.