TG: వడగండ్ల వాన బీభత్సం.. తీవ్ర విషాదం (వీడియో)

ఉత్తర తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు భీభత్సం సృష్టించాయి. ఉమ్మడి ఆదిలాబాద్‌, నిజామాబాద్‌, కరీంనగర్‌ జిల్లాల్లో భారీ వర్షం కురిసింది. కొమురంభీం(D) కాగజ్ నగర్ లో ఇంటి గోడ కూలి ఓ వృద్ధుడు మృతి చెందాడు. ఆసిఫాబాద్ లో భారీ వృక్షాలు నేలకూలాయి. మెదక్ లో పిడుగుపాటుకు ఇల్లు ధ్వంసమైంది. కరీంనగర్, నిజామాబాద్, సిద్దిపేట, కామారెడ్డి జిల్లాల్లో వరి, మామిడి పంటలు దెబ్బతిన్నాయి.

సంబంధిత పోస్ట్