హైదరాబాద్ లో వర్షం పడుతోంది. నగరంలోని బేగంపేట, అమీర్ పేట, జూబ్లీహిల్స్, పెద్దమ్మగుడి, మాదాపూర్, హై టెక్ సిటీలో వర్షం కురుస్తోంది. రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రేపు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని HYD వాతావరణ శాఖ వెల్లడించింది. మంచిర్యాల, ఆదిలాబాద్, నిర్మల్, సంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, ములుగుతో పాటు పలు జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలతో.. 40 కి.మీ వేగంతో గాలులు వీస్తాయని తెలిపింది.