TG: ముక్కలు చేసి కుక్కర్‌లో ఉడికించిన ఘటన.. వెలుగులోకి సంచలనాలు

రంగారెడ్డి (D) మీర్‌పేట చిల్లెలగూడ హత్య కేసులో క్లూస్‌ టీమ్‌కి దొరికిన 2 ఆధారాలతో పోలీసులు దర్యాప్తులో ముందుకెళ్తున్నారు. గ్యాస్‌ స్టవ్‌పై శరీరానికి సంబంధించిన ఒక టిష్యూ, రక్తపు మరకలు లభ్యమవడంతో వీటిని ఫొరెన్సిక్‌ ల్యాబ్‌కు క్లూస్‌ టీమ్‌ పంపింది. పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. కాగా, భర్త గురుమూర్తి తన భార్య వెంకటమాధవిని ముక్కలు ముక్కలుగా నరికి కుక్కర్ లో ఉడికించి చెరువులో పడేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే.

సంబంధిత పోస్ట్