సిద్దిపేట జిల్లా కొండపోచమ్మ సాగర్‌లో సెల్ఫీ కోసం దిగి గళ్లంతై మృతి చెందిన ఐదుగురిలో ఒక యువకుని మృతదేహాన్ని పోలీసులు వెలికి తీశారు. గల్లంతైన వారిలో యువకుడు చీకట్ల దినేశ్వర్ మృతదేహం లభ్యమయింది. మరో నలుగురి మృతదేహాల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చీకట్ల దినేశ్వర్ వయస్సు 17 సంవత్సరాలు. తండ్రి కిషన్. డిప్లొమా చదువుతున్నాడు. హైదరాబాద్‌లోని బన్సీలాల్‌పేట్ సమీపంలోని కవాడిగూడ స్వస్థలం.