నాగర్ కర్నూల్ జిల్లాలో ఘోరమైన ఘటన కలకలం రేపుతోంది. చదువుకోవడం లేదని కోపోద్రిక్తుడైన తండ్రి కొడుకుని చితకబాది సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. కొల్లాపూర్ పట్టణంలో చదువుకోవడం లేదని 8 ఏళ్ల తన కొడుకును ఓ తండ్రి చితకబాది, గోనె సంచిలో మూటకట్టి చెరువులో పడేశాడు. దీనిని గమనించిన స్థానికులు బాలుడిని కాపాడారు.