హైదరాబాద్ శివారులోని గొళ్లపల్లి కలాన్ వద్ద ORRపై ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. లారీని కారు వెనక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో BRS మాజీ ఎమ్మెల్యే తీగల కృష్ణారెడ్డి మనవడు, ముసారాంబాగ్ మాజీ BRS కార్పొరేటర్ తీగల సునరిత రెడ్డి కుమారుడు కనిష్క్ రెడ్డి(19) మృతి చెందాడు. తీవ్రంగా గాయపడ్డ కనిష్క్‌ని ఆస్పత్రిలో చేర్పించగా.. చికిత్స పొందుతూ చనిపోయాడు.