తెలంగాణలో TET అభ్యర్థులకు విద్యాశాఖ కీలక అలర్ట్ జారీ చేసింది. జూన్ 2026లో జరిగే ఉపాధ్యాయ అర్హత పరీక్షకు దరఖాస్తు చేసిన వారు తమ అప్లికేషన్లలో పొరపాట్లు సరిచేసుకునేందుకు ‘ఎడిట్ ఆప్షన్’ను బుధవారం ప్రారంభించారు. ఈ సవరణలకు మే 3 వరకు అవకాశం కల్పించారు. అభ్యర్థులు అధికారిక వెబ్‌సైట్ ద్వారా వివరాలు చెక్ చేసి సరిచేసుకోవాలని సూచించారు. మరోవైపు, కొత్త దరఖాస్తులకు ఏప్రిల్ 30 చివరి తేదీగా నిర్ణయించారు. ఆ తర్వాత ఎలాంటి మార్పులు అనుమతించబడవని స్పష్టం చేశారు.