TG: హనుమకొండ జిల్లాలోని మహాత్మా జ్యోతీబాపూలే బాలుర గురుకుల పాఠశాలలో సోమవారం గుండెపోటుతో ఇంటర్ సెకండ్ ఇయర్ విద్యార్థి మణిదీప్ (17) మృతి చెందాడు. ఉదయం గ్రౌండుకు వెళ్లి రన్నింగ్ చేస్తుండగా మణిదీప్ కిందపడిపోయాడు. మూర్ఛ వచ్చి పడిపోయాడనే అనుమానంతో చేతిలో తాళాలు పెట్టి, కాళ్లు చేతులు రుద్దినా స్పృహలోకి రాకపోవడంతో స్కూల్ సిబ్బంది MGM ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ కాసేపటికే మణిదీప్ మృతి చెందాడు.