TG: దారుణం.. సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

రంగారెడ్డి (D) రాజేంద్ర నగర్ PS పరిధిలోని హైదర్ గూడలో బుధవారం దారుణ ఘటన జరిగింది. పెళ్లి చేసుకుని నెల రోజులు కూడా కాకముందే సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏపీలోని కర్నూలుకు చెందిన యువకుడు అరుణ్.. సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేస్తూ HYDలో నివాసం ఉంటున్నాడు. ఇతనికి 21 రోజుల క్రితమే వివాహం జరిగింది. ఏం జరిగిందో ఏమో కానీ.. నిన్న రాత్రి ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్