రంగారెడ్డి(D) గండిపేటలో గురువారం యువకుడు మల్లికార్జున్ ఒంటిపై పెట్రోల్ పోసుకుని నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇన్‌కమ్ ట్యాక్స్ అధికారులమంటూ GST కట్టాలని కాల్స్ చేస్తూ వేధించారని అన్నకు చెప్పి బాధపడ్డారు. రెండ్రోజులుగా కాల్స్ రావడంతో ఒత్తిడి భరించలేక ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మల్లిఖార్జున్ అరుపులు విని స్థానికులు మంటలను ఆర్పివేశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా.. అప్పటికే 80 శాతం శరీరం కాలిపోయింది. చికిత్స పొందుతూ మృతి చెందాడు.