టీజీ20 టోర్నమెంట్‌లో భాగంగా జరిగిన మ్యాచ్‌లో ఖమ్మం ఏసెస్ జట్టు మెదక్ ఫాల్కన్స్‌పై 19 పరుగుల తేడాతో అద్భుత విజయాన్ని అందుకుంది. 191 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన మెదక్ జట్టు, నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 171 పరుగులకే పరిమితమైంది. ఖమ్మం బౌలర్లలో విద్యానందరెడ్డి, వఫీ, హర్షిత్ సాయి రెండేసి వికెట్లు తీయగా, వేద్‌రెడ్డి ఒక వికెట్ సాధించాడు. ఈ విజయంతో ఖమ్మం ఏసెస్ జట్టు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించింది.