TG: రాష్ట్రంలో ఇంజనీరింగ్ కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించే ‘TG EAPCET-2026’ పరీక్షలకు జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం (JNTUH) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. మే 9 నుంచి మే 11 వరకు మూడు రోజుల పాటు ఈ పరీక్షలు జరగనున్నాయని కన్వీనర్ డాక్టర్ కె.విజయ్ కుమార్ రెడ్డి ప్రకటించారు. ఈ ఏడాది ఇంజనీరింగ్ స్ట్రీమ్ కోసం మొత్తం 2,10,766 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, వారి కోసం రాష్ట్రవ్యాప్తంగా 125 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేశారు.