తెలంగాణ గెజిటెడ్ ఆఫీసర్స్ అసోసియేషన్ (TGO) రాష్ట్ర అధ్యక్షుడు ఏలూరి శ్రీనివాసరావు ప్రయాణిస్తున్న కారు ఖమ్మం జిల్లా వైరా మండలం రెబ్బవరం వద్ద ప్రమాదానికి గురైంది. వైరా నుంచి మధిర వైపు వెళ్తుండగా, ఇటీవల కాలిపోయిన చెట్టు కొమ్మ అకస్మాత్తుగా కారుపై పడటంతో డ్రైవర్ బ్రేక్ వేయగా కారు అదుపుతప్పి బోల్తా కొట్టింది. శ్రీనివాసరావుతో పాటు ఆయన తల్లిదండ్రులు, సతీమణి, డ్రైవర్ కారులో ఉన్నారు. అదృష్టవశాత్తూ అందరూ స్వల్ప గాయాలతో సురక్షితంగా బయటపడ్డారు. పంట వ్యర్థాలకు నిప్పు పెట్టడంతో చెట్టు కాలి బలహీనపడటమే ప్రమాదానికి కారణమని తెలిసింది.