తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC) రాష్ట్ర ఆర్థిక, గణాంకాల శాఖలో 102 మండల ప్లానింగ్ అండ్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (MPSO), అసిస్టెంట్ స్టాటిస్టికల్ ఆఫీసర్ (ASO) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాటిస్టిక్స్ ప్రధాన సబ్జెక్టుగా బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన వారు, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, కామర్స్, కంప్యూటర్ సైన్స్ సబ్జెక్టుల్లో ఏదైనా ఒకదాన్ని ప్రధాన సబ్జెక్టుగా తీసుకుని డిగ్రీ ఉత్తీర్ణులైన వారు అర్హులు. నవంబర్ 27 వరకు దరఖాస్తుకు ఛాన్స్ ఉంది.