TGSET ఫలితాలు విడుదల

తెలంగాణ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (TGSET) ఫలితాలను ఉస్మానియా యూనివర్సిటీ విడుదల చేసింది. అసిస్టెంట్ ప్రొఫెసర్, లెక్చరర్ పోస్టులకు అర్హత కల్పించే ఈ పరీక్షలు సెప్టెంబర్ 28, 29, 30 తేదీల్లో 29 సబ్జెక్టులలో CBT విధానంలో జరిగాయి. మొత్తం 40,863 మంది దరఖాస్తు చేసుకోగా, అందులో 35,003 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరిలో 2,371 మంది అర్హత సాధించారు. అభ్యర్థులు తమ ఫలితాలను అధికారిక వెబ్‌సైట్ ద్వారా చూసుకోవచ్చని అధికారులు సూచించారు.

సంబంధిత పోస్ట్

✕
✕