తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు ఏప్రిల్ 23వ తేదీన నిర్వహించనున్నారు. ఈ క్రమంలో టీవీకే అధినేత విజయ్ సోమవారం నామినేషన్ దాఖలు చేయనుండాగా, ఆయన తన నివాసం నుంచి బయల్దేరి వెళ్లారు. పెరంబూరు, తిరుచ్చి తూర్పు నియోజకవర్గాల నుంచి ఎన్నికల్లో పోటీ చేయనున్నారు. పెరంబూరు అసెంబ్లీ నియోజకవర్గం నుండి తన నామినేషన్‌ను దాఖలు చేయడానికి, చెన్నైలోని వ్యాసర్‌పాడిలోని డాక్టర్ అంబేద్కర్ ప్రభుత్వ కళాశాలకు చేరుకున్నారు.